Adipurush.. మరో పాన్ ఇండియా మూవీ

Tuesday,August 18,2020 - 12:34 by Z_CLU

మహాసేనతో కలిసి యుద్ధం చేశాడు బాహుబలి
వానరసేనతో కలిసి మహాయుద్ధం చేయబోతున్నాడు ఆదిపురుషుడు

ప్రభాస్ నుంచి మరో పాన్-ఇండియా మూవీ రాబోతోంది. అది కూడా మైథిలాజికల్ సోషియో ఫాంటసీ. దీని పేరు ఆదిపురుష్. ఓ ఇతిహాసం నేపథ్యంగా ఈ సినిమాను తీయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. రామాయణంలోని ఓ పార్ట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా రాబోతోంది. ప్రభాస్ ఇందులో రాముడిగా కనిపించబోతున్నాడు.

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది Prabhas Adipurush ప్రాజెక్టు. హిందీ-తెలుగు భాషల్లో సైమల్టేనియస్ గా తీసి.. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేయబోతున్నారు. ఇంకో ఎట్రాక్షన్ ఏంటంటే.. ఈ సినిమా 3Dలో రాబోతోంది.

గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

వచ్చే ఏడాది సినిమాను స్టార్ట్ చేసి, 2022లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.