Adipurush - సెట్స్ పైకి ప్రభాస్ ఎపిక్ డ్రామా

Tuesday,February 02,2021 - 06:50 by Z_CLU

భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ లాంఛ్ అయింది. ముంబయిలో జరిగిన ఈ లాంఛింగ్ కు ప్రభాస్ ఎటెండ్ అయ్యాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఛీప్ గెస్ట్.

Prabhas adipurush launch 1

400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతోంది ఆది పురుష్ సినిమా. కంప్లీట్ గా మోషన్ క్యాప్చుర్ టెక్నాలజీతో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. లాంఛింగ్ లో భాగంగా హనుమంతుడి క్యారెక్టర్ పై ఫస్ట్ షాట్ తీశారు.

Prabhas adipurush launch 1

ఓం రౌత్ దర్శకత్వంలో టీ-సిరీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా పాత్రలో కనిపించబోతున్నాడు. సీత పాత్ర కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారు. త్వరలోనే ఆమె పేరును ఎనౌన్స్ చేస్తారు.

Prabhas adipurush launch 1

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరోవైపు సలార్ సినిమా రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది. ఈరోజు ఆదిపురుష్ కూడా సెట్స్ పైకి వచ్చింది. దీంతో ప్రభాస్ నుంచి ఒకేసారి 3 సినిమాలు షూటింగ్ స్టేజ్ కు వచ్చినట్టయింది.