స్పీడ్ పెంచిన పవర్ స్టార్

Friday,October 21,2016 - 06:35 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కాటమరాయుడు షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్… మరోవైపు ఏఎం రత్నం సమర్పణలో ఓ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఈ రెండు సినిమాలు కాకుండా.. వచ్చే నెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించబోతున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్… పాటల కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. ఈసారి షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నాడు.

pawan-kalyan

2019లోపు 4 సినిమాలు కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు పవన్. ఇప్పటికే 3 సినిమాలకు కాల్షీట్లు కేటాయించాడు. ఆ నాలుగో సినిమాను కూడా వచ్చే ఏడాది ఓకే చేయాలని అనుకుంటున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే, మరోవైపు తన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బిల్డప్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే తన సినిమాలకు సంబంధించి షెడ్యూల్స్ అన్నీ ఇక్కడే ప్లాన్ చేస్తున్నాడు పవన్.