ఎన్టీఆర్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ?

Wednesday,December 21,2016 - 08:00 by Z_CLU

‘జనతా గ్యారేజ్’ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. త్వరలో బాబీ డైరెక్షన్ లో చేయనున్న సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడు. మొన్నటి వరకూ ఈ కథకు చాలా టైటిల్స్ పరిశీలించిన యూనిట్ ఫైనల్ గా ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారట. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పౌరాణిక పాత్రల్లో కూడా కనిపించ బోతున్నాడట తారక్. అందుకే ఈ సినిమా కు ‘నట విశ్వరూపం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

    ఈ సినిమా ప్రధానంగా ఇండస్ట్రీలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎన్టీఆర్-బాబి మధ్య కథాచర్చలు కూడా పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లేను సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం బాబి బిజీగా ఉన్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.