పాజిటివ్ సెంటిమెంట్: "అరవింద" కూడా హిట్టే

Wednesday,October 10,2018 - 10:49 by Z_CLU

రిలీజ్ కు సరిగ్గా 2 రోజుల ముందు నుంచి అరవింద సమేత చుట్టూ ఓ పాజిటివ్ సెంటిమెంట్ అల్లుకుంది. అదేంటంటే సినిమా డ్యూరేషన్. అవును.. ఈ సినిమా రన్ టైమ్ కాస్త ఎక్కువగా ఉంది. కాబట్టే సినిమా హిట్ అంటున్నారు చాలామంది.

భరత్ అనే నేను, రంగస్థలం, మహానటి.. ఈ ఏడాది రిలీజై సూపర్ హిట్ అయిన సినిమాలివి. ఈ సినిమాలన్నీ రెండున్నర గంటల కంటే ఎక్కువే ఉన్నాయి. అలా కాస్త ఎక్కువ నిడివితో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో, అరవింద సమేత కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బాగా బలపడింది.

అరవింద సమేత రన్ టైమ్ 167 నిమిషాలుంది. సెకండాఫ్ లో సినిమా నిడివి కాస్త పెరిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ పాజిటివ్ సెంటిమెంట్, అరవింద సమేతపై మరిన్ని అంచనాల్ని పెంచేసింది.