నేను సేఫ్.. పుకార్లు నమ్మొద్దు

Monday,July 15,2019 - 12:48 by Z_CLU

తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు నటుడు, దర్శకరచయిత పోసాని కృష్ణమురళి. తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, మరో వారం రోజుల్లో సెట్స్ పైకి కూడా వెళ్తానని క్లారిటీ ఇచ్చారు.

“కొన్నాళ్లుగా నా ఆరోగ్యం బాగాలేదని, విషమంగా ఉందని సోషల్ మీడియాలో వచ్చినట్టు నా ఫ్రెండ్స్ చెప్పారు. నిజమే నాకు ఆరోగ్యం బాగాలేదు. కానీ చచ్చిపోయేంత కాదు. డాక్టర్లు నన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతుడ్ని చేశారు. కాబట్టి నా ఆరోగ్యం గురించి మీకెలాంటి ఆలోచనలు వద్దు. వారం, 10 రోజుల్లో మళ్లీ షూటింగ్ కు వెళ్తాను. తెరపై కనిపిస్తాను. ఇన్నాళ్లూ నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందినవాళ్లకు కృతజ్ఞతలు.”

ఇలా తన హెల్త్ కండిషన్ పై వివరణ ఇచ్చారు పోసాని. ఈ నటుడికి ఈమధ్య సర్జరీ జరిగింది. అది సక్సెస్ ఫుల్ అయింది కూడా. రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లి వస్తున్న టైమ్ లో ఇలా రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో పోసాని స్వయంగా సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు.