పూజ కుమార్ ఇంటర్వ్యూ

Monday,October 30,2017 - 06:04 by Z_CLU

రాజశేఖర్ హీరోగా నటించిన PSV గరుడవేగ 126.16M నవంబర్ 3 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ సరసన పూజ కుమార్ హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూజ కుమార్ ఈ సినిమాకు సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

పాత్ బ్రేకింగ్ మూవీ…

PSV గరుడవేగ లో యాక్షన్, ఇమోషన్స్ మాత్రమే కాదు, ఈ సినిమా కంప్లీట్ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. ట్రైన్ సీక్వెన్సెస్ తో పాటు బైక్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. సినిమా చూశాక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది.

 

ఇంట్రెస్టింగ్  క్యారెక్టర్

ఈ సినిమాలో స్వాతి అనే క్యారెక్టర్ చేశాను. పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న హౌజ్ వైఫ్ క్యారెక్టర్. తన హజ్బెండ్ దేశాన్ని రక్షించే పనిలో ఉన్నాడని గర్విస్తూనే, పరోపక్క తన పనిలో బిజీగా ఉంటూ ఫ్యామిలీ కోసం కాస్త టైమ్ కూడా ఇవ్వట్లేదని బాధపడే సాధారణ గృహిణిలా నటించాను.

సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్

ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, దానికి తోడు విజువల్ ఎఫెక్ట్ తో పాటు ఫోటోగ్రఫీ సినిమాకి ప్రాణం.

నేను స్టోరీ వినలేదు

నిజానికి నేనీస్టోరీ వినలేదు. డైరెక్టర్ గారు ఈ సినిమాని నా చేతుల్లో పెట్టారు. 120 పేజీల బౌండ్ స్క్రిప్ట్. అందులో ఒక్కో పేజీ చదువుతుంటే సినిమా కళ్ళముందు కనిపించింది.

నాకలా అనిపించింది…

ఈ సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ ఎంత సేపు ఉండబోతుంది అనే ఆలోచన కన్నా, నా క్యారెక్టర్ ని మేల్, ఫీమేల్ అనే తేడా లేకుండా అందరూ కనెక్ట్ అవ్వడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది….

 

రాజశేఖర్ గారి స్పెషాలిటీ అదే…

రాజశేఖర్ గారు మంచి యాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ, ఈ సినిమాలో ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలివేట్ అవుతాయి. ఆయన కంప్లీట్ కరియర్ లో ఇది స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. ఆయన ట్రైన్ పై రన్నింగ్ చేసే సీక్వెన్సెస్  కానీ, వాటర్ సీక్వెన్సెస్ కానీ సినిమాలో హైలట్ కానున్నాయి.