బన్నీ తగ్గినా పూజా హెగ్డే తగ్గడం లేదుగా

Saturday,March 14,2020 - 11:48 by Z_CLU

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా. అయితే కొందరు దీన్ని పట్టించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇందులో మొదటి కేటగిరీలోకి బన్నీ వస్తాడు. రెండో కేటగిరీలోకి పూజా హెగ్డే వస్తుంది.

బన్నీ-సుకుమార్ కాంబోలో సినిమా ఈపాటికి సెట్స్ పైకి రావాలి. ఫస్ట్ షెడ్యూల్ ను కేరళ ఉత్తరప్రాంతంలో ఉన్న అడవుల్లో ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు కేరళలో కరోనా ఉంది. అందుకే ఈ సినిమా షూటింగ్ ను వాయిదావేశారు. కరోనా ప్రభావం లేని మరో ప్రాంతంలో లేదా సెట్ లో షూట్ చేయాలని నిర్ణయించారు.

అటు పూజా హెగ్డే మాత్రం తగ్గలేదు. ప్రభాస్ మూవీలో నటించడం కోసం ఏకంగా జార్జియా వెళ్లింది. ప్రతి ఎయిర్ పోర్ట్ లో ఇప్పుడు హైఎలర్ట్ ఉంది. ఎవరి పక్కన కూర్చుంటే కరోనా వస్తుందా అనే భయం అందర్లో ఉంది. అయినప్పటికీ పూజాహెగ్డే మాస్క్ వేసుకొని మరీ జార్జియా వెళ్లిపోయింది. ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని తిరిగి ఇండియా వస్తుంది.