Acharya ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ !

Thursday,February 11,2021 - 04:10 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ ‘సిద్ద’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. తాజాగా పూజ ‘ఆచార్య‘ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చి షూట్ లో పాల్గొంది .

కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన ధర్మస్థలి సెట్ లో పూజా హెగ్డే పై రెండు రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. మళ్ళీ వచ్చే నెలలో పూజ , రామ్ చరణ్ లపై మరికొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు. వచ్చే నెలతో టోటల్ షూట్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు కొరటాల. మరి పూజ పాత్రలో ఎలా ఉండబోతుంది ? సినిమాలో ఆమె పార్ట్ ఎంత్ సేపు ఉంటుంది? అనేవి తెలియాల్సి ఉంది.

మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.