Pooja Hegde F3 - నవ్వులే కాదు, అందాలు కూడా

Friday,April 15,2022 - 12:04 by Z_CLU

Pooja Hegde starts Special song Shoot of F3 Movie

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న F3 Movieకి ఇప్పుడు మరింత గ్లామర్ యాడ్ అయింది. తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే ఎంటర్ అయింది. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

పూజా హెగ్డే సెట్స్ పైకొచ్చిన విషయాన్ని యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. కాకపోతే పూజా హెగ్డే పేరు చెప్పలేదు. వెనక వైపు నుంచి ఆమె నిల్చుున్న ఫొటోను మాత్రం షేర్ చేశారు

ఈ సినిమాలో వెంకటేష్ కు హీరోయిన్ గా తమన్న, వరుణ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు. వీళ్లిద్దరు కాకుండా మరో ఇంపార్టెంట్ రోల్ కోసం సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే వచ్చి చేరింది. దీంతో ఎఫ్3 మూవీలో నవ్వులే కాకుండా, గ్లామర్ డోస్ కూడా బాగానే పెరిగింది. రంగస్థలంలో జిగేలు రాణి అనే స్పెషల్ సాంగ్ చేసింది పూజా. ఆ తర్వాత మళ్లీ ఆమె మరో స్పెషల్ సాంగ్ చేయడం ఇదే.

Pooja Hegde

అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఎఫ్3 సినిమా. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మే 27న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది ఈ నవ్వుల హంగామా.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics