లొకేషన్ షిఫ్ట్ చేసిన పూజా హెగ్డే

Saturday,September 21,2019 - 02:07 by Z_CLU

మొన్నటివరకు గద్దలకొండ గణేష్ సినిమా లొకేషన్ లో సందడి చేసింది. ఆ మూవీ ప్రమోషన్ తోనే బిజీగా ఉంది. ఇప్పుడా సినిమా థియేటర్లలోకి వచ్చేయడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సినిమా స్టార్ట్ చేసింది పూజాహెగ్డే. అవును.. అఖిల్ సినిమా సెట్స్ లో ప్రత్యక్షమైంది పూజా.

నిన్నట్నుంచి అఖిల్ సినిమా షూటింగ్ లో పూజా పాల్గొంది. లొకేషన్ కు వచ్చిన ఆమెకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది యూనిట్. ఓ బొకే ఇచ్చి సాదర స్వాగతం పలికింది. తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆమెకు సీన్ వివరించాడు. 2 టేక్స్ కే షాట్ ఓకే అయింది.

ఈ షెడ్యూల్ లో అఖిల్ కూడా పాల్గొంటున్నాడు. అఖిల్, పూజా హెగ్డే కారవాన్స్ ను పక్కపక్కనపెట్టి యూనిట్ ఓ చిన్న వీడియోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. సినిమాకు సంబంధించి పూజా హెగ్డే న్యూ లుక్ కూడా ఉంది.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై వస్తోంది అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ మూవీ. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు.