NTR ని రీచ్ అవ్వడం చాలా కష్టం – పూజా హెగ్డే

Monday,October 22,2018 - 03:36 by Z_CLU

నిన్న జరిగిన ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ లో చాలా ఎగ్జైటెడ్ గా మాట్లాడింది పూజాహెగ్డే. ఈ సినిమాలో అరవింద క్యారెక్టర్ ని అంత అందంగా రాసుకున్నందుకు, అలాంటి అద్భుతమైన క్యారెక్టర్ కోసం తనను ఎంచుకున్నందుకు త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పుకుంది. ఇక NTR గురించి మాట్లాడుతూ ఓ విషయం రియలైజ్ అయ్యాను అని చెప్పుకుంది ఈ హీరోయిన్.

“నిన్న మొన్నటి వరకు నాకు నేనే చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్ అనుకునే దాన్ని. కానీ NTR ని చూశాక డెడికేషన్ అంటే ఏంటో అర్థమయింది. ఆయన సెట్స్ పై ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుందో, అంత పాజిటివిటీ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఏ మాత్రం బ్రేక్ అవ్వని ఆయన డెడికేషన్ లెవెల్స్ కి నిజంగా హ్యాట్సాఫ్. ఈ సినిమాలో నటించినందుకు చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను”. అని చెప్పుకుంది పూజా హెగ్డే.

అరవింద సమేత లో జస్ట్ గ్లామర్ కోసమే అని కాకుండా, సినిమాలో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటించింది పూజా హెగ్డే. NTR, పూజా హెగ్డే కాంబినేషన్ లో ఉన్నవీ 2 సాంగ్సే అయినా, NTR ఎనర్జీకి పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడీ అనిపించుకుంది ఈ ముంబై భామ.