'రంగస్థలం'లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్

Wednesday,October 04,2017 - 04:45 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాలో మరో స్పెషల్ ఎలిమెంట్ ఆడ్ అయింది… ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే పెర్ఫార్మ్ చేయనుందట. లేటెస్ట్ గా ఈ న్యూస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ ను త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో తన హాట్ అందాలతో మెస్మరైజ్ చేసిన ఈబ్యూటీ ‘రంగస్థలం’లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందన్న మాట. అంతే కాక ఈ సినిమాకు సంబంధించి అక్టోబర్ లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్ డేట్స్ అందిస్తామంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు మేకర్స్.