JGM విజయ్ కి హీరోయిన్ ఫిక్స్ ?

Saturday,May 14,2022 - 03:05 by Z_CLU

Pooja Hegde roped in Vijay deverakonda’s JGM ?

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘JGM’ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ బయటికొచ్చింది. ఇటివలే ముంబైలో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం పూజ 45 డేస్ డేట్స్ ఇచ్చి ప్రాజెక్ట్ సైన్ చేసిందని సమాచారం. జులైలో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె సెట్స్ లో పాల్గొననుందని అంటున్నారు.

పూరి డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ముందు హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని తీసుకోవాలని భావించారు. ఈ సినిమాతో పూరి ఆమెను సౌత్ లో హీరోయిన్ గా లాంచ్ చేయబోతున్నారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో పూజని ఫైనల్ చేసుకున్నారట మేకర్స్. ఇంకా మేకర్స్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ త్వరలోనే పూజకి  వెల్కం చెప్తూ ఆన్ బోర్డ్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. జులై నుండి షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు చార్మీ కౌర్ , వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics