ఐటమ్ సాంగ్ షూటింగ్ లో రామ్ చరణ్ ‘రంగస్థలం’

Monday,February 05,2018 - 03:22 by Z_CLU

రీసెంట్ గా బన్ని ‘DJ’ లో హీరోయిన్ గా మెస్మరైజ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు చెర్రీ ‘రంగస్థలం’లో స్టెప్పులు వేస్తుంది. 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన సిజిలింగ్ పర్ఫామెన్స్ తో హీట్ పెంచనుంది పూజా హెగ్డే. రామ్ చరణ్ సరసన సమంత నటిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించనుందీ అందాల భామ. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్  జరుపుకుంటుంది.

జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ లో చెర్రీ, పూజ అవుట్ అండ్ అవుట్ మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ కి కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ రంగస్థలం షూటింగ్ కి ప్యాకప్ చెప్పినట్టే.

 

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.