‘అరవింద సమేత’ కోసం పూజా హెగ్డే

Wednesday,August 29,2018 - 05:38 by Z_CLU

ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది NTR ‘అరవింద సమేత’. ఈ సినిమాలో NTR సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.

టాలీవుడ్ లోని ఆల్మోస్ట్ టాప్ హీరోల సరసన నటిస్తూ ఫామ్ లో ఉన్న పూజా, ఈ సినిమాతో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం బిగిన్ చేసింది. ఇప్పటికే తెలుగు నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్న పూజా హెగ్డే, ఈ సినిమాతో కంప్లీట్ నటి అనిపించుకోనుంది.

రీసెంట్ గా పోచంపల్లి కి సమీపంలోని ఒక ఊళ్ళో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, త్వరలో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేయనుంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం తమన్ ఆల్రెడీ BGM కంపోజ్ చేయడం కూడా బిగిన్ చేసేశాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.