#MostEligibleBachelor - మరో న్యూ లుక్

Tuesday,October 13,2020 - 02:52 by Z_CLU

హాట్ బ్యూటీ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. పూజాకు బర్త్ డే విశెష్ చెబుతూనే, ఆమె క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు.

సినిమాలో పూజా హెగ్డే పేరు “విభ”. మోడ్రన్ అమ్మాయి పాత్రలో అల్ట్రా గ్లామరస్ గా మెరిసిపోతోంది Pooja Hegde.

నిజానికి Most Eligible Bachelor మూవీ నుంచి ఇది పూజా హెగ్డే ఫస్ట్ లుక్ కాదు. ఇంతకుముందే ఆమెకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. బర్త్ డే కాబట్టి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారంతే.

Most Eligible Bachelor

ఇక మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే.. సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి డబ్బింగ్ వర్క్ మొదలైంది. అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.

Also Check – Pooja Hegde Stills