రొమాంటిక్ జోన్ లో NTR సినిమా

Monday,May 14,2018 - 01:06 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది NTR త్రివిక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్సయిన పూజా హెగ్డే ఈ రోజు నుండి సెట్స్ పైకి వచ్చేసింది. సినిమా షూటింగ్ బిగిన్ చెసినప్పటి నుండే కంప్లీట్  కాన్సంట్రేషన్, యాక్షన్ సీక్వెన్సెస్ పై పెట్టిన ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు నుండి NTR, పూజా హెగ్డే కాంబినేషన్ లో రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు.

యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో NTR ని మోస్ట్ స్టైలిష్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా టైటిల్ విషయంలో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ నడుస్తున్నాయి.

 

హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రాధాకృష్ణ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.