పూజా హెగ్డే ఎకౌంట్ హ్యాక్

Thursday,May 28,2020 - 01:50 by Z_CLU

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ అయింది. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆమె ఎకౌంట్ ను హ్యాక్ చేసి, కొన్ని పోస్టులు కూడా పెట్టారు. దీనిపై పూజా హెగ్డే వెంటనే రియాక్ట్ అయింది. తన ఎకౌంట్ హ్యాక్ అయిందని, పోస్టులకు ఎవ్వరూ స్పందించొద్దని కోరింది. వ్యక్తిగత సమాచారాన్ని అస్సలు ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేసింది.

అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ పోస్ట్ పెట్టింది పూజ. అయితే ఆ వెంటనే ఆమె టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. గంటలోనే ఎకౌంట్ ను మళ్లీ యాక్టివేట్ చేసింది. దీంతో అర్థరాత్రి ఒంటిగంట టైమ్ లో మరో ట్వీట్ పెట్టింది పూజ.

తన ఎకౌంట్ మళ్లీ తన చేతిలోకి వచ్చిందని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు పెట్టిన మెసేజీలన్నీ డిలీట్ చేశామని చెప్పిన పూజా హెగ్డే.. టెక్నికల్ టీమ్ కు థ్యాంక్స్ చెప్పింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అఖిల్ సరసన వరల్డ్ ఫేమస్ లవర్, ప్రభాస్ సరసన మరో సినిమా చేస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ స్టార్ట్ అవుతాయి.