మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ

Monday,March 30,2020 - 03:26 by Z_CLU

ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. హీరోలంతా ఆమెనే కోరుకుంటున్నారు. ఇదే ఊపులో కోలీవుడ్ హీరోల కన్ను కూడా ఈ బుట్టబొమ్మపై పడింది. అన్నీ అనుకున్నట్టు నడిస్తే, త్వరలోనే తమిళ స్టార్ హీరో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

హరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. వీళ్లిద్దరికీ సూపర్ హిట్ కాంబినేషన్. సింగం సిరీస్ వీళ్లదే. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఫ్రెష్ గా మరో సినిమా (సింగం సిరీస్ కాదు) స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది పూజా హెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ డియర్ అనే సినిమా చేస్తోంది. అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు సూర్య సినిమాతో కోలీవుడ్ లో కూడా చక్రం తిప్పడానికి రెడీ అవుతోంది. అన్నట్టు పూజా హెగ్డే కెరీర్ స్టార్ట్ అయింది కోలీవుడ్ లోనే.