NTR త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే..?

Friday,January 26,2018 - 06:00 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది NTR, త్రివిక్రమ్ మూవీ. జై లవకుశ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత సెట్స్ పైకి రానున్న ఈ సినిమాపై న్యాచురల్ గానే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు కాస్ట్ & క్రూ ని అనౌన్స్ చేయని సినిమా యూనిట్, ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ లోపు NTR సరసన స్పేస్ కొట్టేయనున్న హీరోయిన్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.

నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువేల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందన్న టాక్ వినిపించింది. ఆ విషయంలో ఫిలిం మేకర్స్ రియాక్ట్ అయితే అవ్వలేదు కానీ, ఈ లోపు అనూ ఇమ్మన్యువెల్ ప్లేస్ లో ఇప్పుడు పూజా హెగ్డే వినిపిస్తుంది.

త్రివిక్రమ్ సినిమాలో మ్యాగ్జిమం ఇద్దరు హీరోయిన్స్ గ్యారంటీ కాబట్టి, త్రివిక్రమ్ ఈ ఇద్దరినీ ప్రోఫార్ చేస్తున్నాడా..? లేకపోతే అనూ ఇమ్మాన్యువేల్ తప్పించి పూజా హెగ్డే ని ఫిక్స్ చేసుకున్నారా…? ఇది ఇప్పుడు NTR ఫ్యాన్స్ లో ట్రెండింగ్ అవుతున్న మిలియన్ డాలర్ క్వశ్చన్స్. ఈ డైలామా నుండి బయటపడాలంటే ఫిల్మ్ మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.