భారీ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే

Sunday,May 24,2020 - 01:58 by Z_CLU

ఓ హీరోయిన్ తెలుగులో సినిమాలు చేయొచ్చు. సేమ్ టైమ్ తమిళ్ లో కూడా సినిమాలు చేయొచ్చు. కానీ ఒకేసారి 3-4 భాషల్లో తెరకెక్కే సినిమాలో ఛాన్స్ రావడం గొప్ప విషయం. అలాంటి బడా ఆఫర్ ను అందుకుంది పూజా హెగ్డే. దుల్కర్ సల్మాన్ హీరోగా రాబోతున్న ఓ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయింది.

త్వరలోనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు “మహానటి” ఫేమ్ దుల్కర్ సల్మాన్. స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్నప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. తెలుగులో దుల్కర్ కు ఇది రెండో స్ట్రయిట్ మూవీ కాగా.. ఈ మూవీని ఒకేసారి తెలుగుతో పాటు తమిళ-మలయాళ-కన్నడ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు.

తన చేతిలో ఓ పెద్ద సినిమా ఉందని.. లాక్ డౌన్ తర్వాత ఆ డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తానని రీసెంట్ గా చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. బహుశా ఆ పెద్ద సినిమా ఇదే కావొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ప్రభాస్, అఖిల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.