Shakunthalam - ఎవరితో తీస్తాడు?

Saturday,October 10,2020 - 04:09 by Z_CLU

టాలీవుడ్ గ్రేట్ ఫిలిం మేకర్స్ లో GunaSekhar ఒకరు. రాజమౌళి తర్వాత జానపద, చారిత్మక చిత్రాలు తీయగలిగిన సత్తా ఉన్న దర్శకుడిగా గుణశేఖర్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తుంటాడు. త్వరలో Rana Daggubati తో తీయబోయే ‘Hiranya kashyapa’ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన గుణా… ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఓ ఆహ్లాదకరైమన ప్రేమకథను ‘Shakunthalam’ టైటిల్ తో తెరకెక్కించబోతున్నాడు.

తాజాగా ఓ వీడియో ద్వారా సినిమాను ప్రకటించిన గుణ శేఖర్.. ఈ ప్రేమకథను ఎవరితో తీస్తాడా అనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. ఇది ప్రేమకథ అయినప్పటికీ Historical Drama జోనర్ లో Female Centric గా రూపొందనుంది.

శకుంతల పాత్రకు హీరోయిన్ Pooja Hegde ను సంప్రదిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్న పూజ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్తుందా లేదా అనేది చూడాలి.