క్లాసికల్ డాన్సర్ గా పూజాహెగ్డే?

Monday,June 15,2020 - 12:15 by Z_CLU

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో 2 సినిమాలు. వీటిలో ఒకటి అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాగా.. రెండోది ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా.

ప్రభాస్ సినిమాలో ఆమె క్లాసికల్ డాన్సర్ గా కనిపించబోతోందని, ఆ క్యారెక్టర్ సినిమాలో ఓ పార్ట్ మాత్రమేనంటూ రూమర్స్ వచ్చాయి. వీటిపై యూనిట్ రియాక్ట్ అయింది. ప్రభాస్ మూవీలో పూజాహెగ్డే, క్లాసికల్ డాన్సర్ కాదని క్లారిటీ ఇచ్చింది.

ప్రభాస్-రాధాకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాథేశ్యామ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. కుదిరితే ఈ నెలలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది యూనిట్.