రవితేజ మళ్ళీ అదే క్యారెక్టర్ లో...

Wednesday,October 30,2019 - 10:02 by Z_CLU

మాస్ మహారాజ్… రవితేజ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించినా అన్ లిమిటెడ్ ఎనర్జీ గ్యారంటీ. అయితే ఆ ఎనర్జీకి పోలీస్ గెటప్ తోడైతే సిల్వర్ స్క్రీన్ పై ఫైర్ జెనెరేట్ అవుతుంది. ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మళ్ళీ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేయబోతున్నాడు రవితేజ. తన కరియర్ లో ఎన్నేసి పోలీస్ గెటప్స్ వేసినా దేనికదే స్పెషల్ అనిపించుకుంది.

టచ్ చేసి చూడు – ఈ సినిమాలో ACP కార్తికేయగా నటించాడు. దానికి తోడు ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేసుకోవాలనే అడిషనల్ క్వాలిటీ. పోలీసాఫీసర్ గా రవితేజ మాసివ్ మ్యానరిజం సింప్లీ సూపర్బ్.

పవర్ – ACP బల్దేవ్ సహాయ్. పక్కా కరప్టెడ్ పోలీసాఫీసర్. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేశాడు రవితేజ. అంటే కనిపించింది ఆల్మోస్ట్ పోలీసాఫీసర్ గెటప్ లోనే.. కాకపోతే ఈ సినిమాలో రెండేసి రకాల మ్యానరిజంతో అదరగొట్టేశాడు.

వీర  – సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించాడు. కానీ నిజానికి అది ఫేక్ క్యారెక్టరే. తన చెల్లెలి ఫ్యామిలీని కాపాడుకోవడానికే ఆఫీసర్ లా వస్తాడు. కాకపోతే ఆ నిజం సినిమాలో ఓ పర్టికులర్ సిచ్యువేషన్ లో రివీల్ అవుతుంది. అప్పటి వరకు రవితేజ కనిపించింది పోలీస్ రోల్ లోనే.

మిరపకాయ్ – ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్. ఓ పర్టికులర్ అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా లెక్చరర్ గా సిటీకి వస్తాడు. ఎక్కడా తానో పోలీసాఫీసర్ అన్న విషయం రివీల్ కాకుండా జాగ్రత్తపడుతూ, అసలు విలన్ ని రీచ్ అవుతాడు. పేరుకి ఇది సీరియస్ క్యారెక్టర్ అయినా, రవితేజ తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఓవరాల్ గా ఎంటర్టైన్ చేశాడు.

విక్రమార్కుడు – రవితేజ ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం చాలా స్పెషల్. ఈ సినిమాలో విక్రమ్ రాథోడ్ ఎంత పవర్ ఫుల్ క్యారెక్టరో.. అత్తిలి సత్తిబాబు కూడా అంతే స్పెషల్. రవితేజ కరియర్ లోనే ఇది మైల్ స్టోన్ సినిమా.

ఈ వరసలో ‘కిక్’ సినిమాలో కూడా అంతే. సినిమా మొత్తంలో దొంగలా పోలీసులను ఇబ్బంది పెట్టుకున్నా, క్లైమాక్స్ కి వచ్చేసరికి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. వీటికి తోడు రేపో మాపో సెట్స్ పైకి రాబోతున్న సినిమాలో కూడా మరో డిఫెరెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు రవితేజ.