కోలీవుడ్ లో పోలీసుల హంగామా

Wednesday,February 01,2017 - 05:35 by Z_CLU

కోలీవుడ్ లో పోలీసుల హంగామా షురూ కానుంది. అవుట్ స్టాండింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లా తెరకెక్కిన సూర్య సింగం 3, జయం రవి-అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన బోగన్, వీటితో పాటు రాఘవ లారెన్స్ మొట్టశివ కెట్టశివ లతో కోలీవుడ్ ఫిబ్రవరిలో లాన్ అండ్ ఆర్డర్ థియేటర్స్ లోకి రానుంది

singam-3-poster

సూర్య కరియర్ లో సూపర్ స్పెషల్ గా నిలిచిన ఫ్రాంచైజీ, అనుష్క, శృతి హాసన్ నటించిన ఈ సినిమా 9 ఫిబ్రవరికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. హరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అటు కోలీవుడ్ లోనే టాలీవుడ్ లోను హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

bogan-movie-poster

అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బోగన్ సినిమాని ప్రభుదేవా నిర్మించాడు. ఈ సినిమాలో జయం రవితో పాటు అరవింద్ స్వామీ విలన్ గా నటించాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన తని ఒరువన్ ఎక్కడికక్కడ స్టాండర్డ్స్ ని సెట్ చేసేసింది. ఈ కాంబో లో వస్తున్న మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందునా హన్సిక హీరోయిన్. జయం రవి, హన్సిక కోలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండింగ్ ఆన్ స్క్రీన్ కపుల్. ఏముంది ఏ రకంగా చూసినా సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసే వాళ్ళే. ఈ సినిమా ఫిబ్రవరి 17 న థియేటర్స్ లోకి వస్తుంది.

motta_shiva_ketta_shiva-poster

తెలుగులో కళ్యాణ్ రామ్ పటాస్ కి రీమేక్ తమిళంలో రాఘవ లారెన్స్ నటించిన మొట్టశివ కెట్టశివ. నిక్కి గల్రాని నటించిన ఈ సినిమాకి సాయి రమణి డైరెక్టర్. ఈ సినిమాలను లారెన్స్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 17 న రిలీజ్ కానుంది.

బాక్సాఫీస్ కి మ్యాగ్జిమం క్లోజ్ డిస్టెన్స్ లో ఉన్న ఈ సినిమాలు ఇప్పటికే పోలీస్ మానియా స్ప్రెడ్ చేస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వెయిట్ ని పెంచడంలో ఏ రేంజ్ లో పోటీ పడతాయో చూడాలి.