ఇకపై థియేటర్లలోనూ జాతీయ గీతం కంపల్సరీ

Thursday,December 01,2016 - 07:05 by Z_CLU

నిన్నమొన్నటి వరకు కేవలం స్కూల్స్ , కాలేజెస్, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ ఆఫీసులలకే పరిమితమైన జాతీయ గీతం ఇప్పుడు సినిమా థియేటర్లలోను తప్పనిసరి అని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. దీని అమలుకు 10 రోజుల గడువు విధించిన అత్యున్నత ధర్మాసనం… థియేటర్లలో జాతీయ గీతం ప్రసారం అవుతున్నప్పుడు, కొన్ని నిబంధనలు కూడా పాటించాలని ఆదేశించింది.

supremecourt

థియేటర్లలో జాతీయగీతం ప్రసారం అవుతున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు లేచి నిలబడాలని ఆదేశించిన సుప్రీంకోర్టు… ఆ టైం లో స్క్రీన్ పై తప్పనిసరిగా జాతీయ జెండా రెపరెపలాడాలని…. ఆడిటోరియం తలుపులు ఎట్టి పరిస్థితుల్లో తెరిచి ఉండకూడదని ఆదేశించింది. తద్వారా జాతీయ గీతాలాపన జరుగుతున్నంత సేపు ఎవరు పడితే లోపలికి రావడం, బయటికి వెళ్ళడం లాంటివి అవాయిడ్ చేయవచ్చని సూచించింది.