సమంతాకిది రెండోసారి...

Tuesday,June 04,2019 - 11:02 by Z_CLU

డిఫెరెంట్ రోల్స్ చేయడం వేరు… సిచ్యువేషన్ డిమాండ్ చేయాలే కానీ యాంగ్ హీరోయిన్స్ కూడా మదర్ రోల్స్ చేయడం చాలా కామన్. కానీ సమంతా విషయంలో మాత్రం వేరు.. సమంతా కూడా మదర్ రోల్స్ వేస్తుంది… కానీ తన కన్నా సీనియర్స్ కి… ఇలాంటి అవకాశం ఇప్పటి వరకు కేవలం సమంతాకే దక్కింది.

‘మనం’ సినిమాలో నాగార్జున కి మదర్ గా నటించింది సమంతా. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ సినిమాలో అంతే అందంగా కుదిరింది కూడా. ఈ సినిమా తరవాత నాగ్ కూడా సమంతా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘ మా.. అమ్మ’ అనే ప్రస్తావిస్తారు. అంతగా న్యాచురల్ గా ఆ సినిమాలో ఆన్ స్క్రీన్ అమ్మ అనిపించుకుంది.

ఇప్పుడు ‘హే బేబీ’ లో కూడా అంతే. రావు రమేష్ కి అమ్మగా కనిపించనుంది సమంతా. కాకపోతే ఇక్కడ క్యారెక్టర్ లో వేరియేషన్ ఉండబోతుంది. ఈ సినిమాలో సమంతా కావాల్సినంత కామెడీ చేయబోతుంది. ఇక ఈ మదర్ సమాంత… కొడుకు రావు రమేష్ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉండబోతుందనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

క్యారెక్టర్స్ ఎంచుకోవడం పెద్ద విషయం కాదు కానీ, ఏ క్యారెక్టర్ ప్లే చేసినా అందులో 100% న్యాచురల్ గా ఇమిడిపోవడం సమంతా స్పెషాలిటీ. అందుకే ఈ ఆన్ స్క్రీన్ మదర్ కి కొడుకుగా ఎవరినీ అటాచ్ చేసినా, అంతే కన్విన్సింగ్ గా ఉంటుంది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యారెక్టర్స్ చేసే అవకాశం ఒక్క సమంతాకే దక్కింది.