ఈ నెలలోనే సెట్స్ పైకి 'పింక్' రీమేక్

Wednesday,January 08,2020 - 11:46 by Z_CLU

తన రీఎంట్రీ గురించి పవన్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. పింక్ రీమేక్ చేయబోతున్నట్టు కూడా ఆయన చెప్పలేదు. కానీ పవర్ స్టార్ ఈ సినిమా చేయబోతున్నారనే మేటర్ అన్-అఫీషియల్ గా బయటకు వచ్చేసింది. సినిమా కూడా రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాబోతోంది,

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 20 నుంచి పింక్ రీమేక్ సెట్స్ పైకి వస్తుంది. అయితే ఈ షెడ్యూల్ లో పవన్ కల్యాణ్ జాయిన్ అవ్వట్లేదు. ఫిమేల్ లీడ్స్ నివేత థామస్, అంజలి, అనన్యతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే సెకెండ్ షెడ్యూల్ నుంచి పవన్ జాయిన్ అవుతాడని టాక్.

అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి రాలేదు పవర్ స్టార్. పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయి బిజీ అయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనకు పింక్ సబ్జెక్ట్ నచ్చింది. అందుకే ఈ సినిమాలో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ ఎప్పుడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.