ప్రారంభమైన పింక్ రీమేక్

Friday,December 13,2019 - 12:01 by Z_CLU

పవన్ కల్యాణ్ రీమేక్ కు రంగం సిద్ధమైంది. పింక్ తెలుగు రీమేక్ ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని అఫీషియల్ గా లాంఛ్ చేశారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 40వ చిత్రంగా రాబోతోంది పింక్ రీమేక్. ఈ రీమేక్ కు వేణుశ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందించబోతున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ తో మూవీ వర్క్ ప్రారంభించారు. తమన్ ఆల్రెడీ ఓ టెర్రిఫిక్ ట్యూన్ ఇచ్చినట్టు ప్రకటించాడు దిల్ రాజు.

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేత థామస్ ను సెలక్ట్ చేశారు. మరో హీరోయిన్ గా అంజలిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సినిమాలో పవన్, లాయర్ గా కనిపించనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి లాస్ట్ వీక్ నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం పవన్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే సినిమా సెట్స్ పైకి వస్తుంది.