పిక్ ఆఫ్ ది డే

Tuesday,August 20,2019 - 06:03 by Z_CLU

సైరా టీజర్ లాంఛ్ కోసం యూనిట్ అంతా ముంబయి వెళ్లింది. సాహో సినిమా ప్రమోషన్ కోసం ఆల్రెడీ ముంబయిలో ఉన్నాడు ప్రభాస్. ముంబయిలో ఈ రెండు సినిమా యూనిట్స్ కలిశాయి. ఈ సందర్భంగా చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ కలిసి ఓ ఫొటో దిగారు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్ అవుతోంది.

బాహుబలి సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు ఓసారి ఇలా అనుకోకుండా చిరంజీవి, ప్రభాస్ కలిశారు. అప్పుడు చిరంజీవి ఖైదీ నంబర్ 150 చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు సంబంధించి ఓ వార్ సీక్వెన్స్ చేస్తున్నాడు. ఆ టైమ్ లో ఇద్దరూ కలిసి బాహుబలి సెట్స్ లో దిగిన ఫొటో వైరల్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి, ప్రభాస్ కలిశారు. ఈ పిక్ కూడా వైరల్ అవుతోంది.

చిరంజీవిపై తన అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నాడు ప్రభాస్. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమన్న ప్రభాస్.. సాహో టీజర్ ను చిరంజీవి మెచ్చుకోవడం తన జీవితంలో మరిచిపోలేనన్నాడు.