NTR ని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయనున్న రాజమౌళి

Monday,October 22,2018 - 12:16 by Z_CLU

క్రేజీ కాంబో మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి రాబోతుంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ ప్రీ ప్రొడక్షన్ పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ కి ప్యాకప్ చెప్పేసిన జక్కన్న, ఇప్పుడు చెర్రీ, చరణ్ ల లుక్స్ పై ఫోకస్ పెట్టాడు. మరీ ముఖ్యంగా NTR లుక్స్ కోసం హాలీవుడ్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ ఈ సినిమాకి పని చేయనున్నాడు.

రీసెంట్ గా రిలీజైన అరవింద సమేత సినిమా గురించి ఏ డిస్కర్షన్ వచ్చినా, NTR 6 ప్యాక్స్ గురించి డిస్కస్ చేయకుండా ఎవ్వరూ ఉండరు. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి NTR లుక్స్. ఆ సినిమాకి పని చేసిన స్టీవెన్ లాయిడ్స్, ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న RRR సినిమాకి కూడా పని చేయడం విశేషం. రీసెంట్ గా NTR లుక్స్ విషయంలో దర్శకుడు రాజమౌళి తో డిస్కస్ చేసిన లాయిడ్ స్టీవెన్, ఆ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

దాంతో ఈ సినిమాలో NTR ని అరవింద సమేత రేంజ్ లో మరింత పవర్ ఫుల్ గా చూడటం గ్యారంటీ అని ఫిక్సయి పోయారు ఫ్యాన్స్. ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్, ఆ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.