Pelli Sandadi - షూటింగ్ అప్ డేట్స్

Tuesday,January 05,2021 - 07:48 by Z_CLU

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా పెట్టి తీస్తున్న ‘Pelli SandaDi’ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తయింది. ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్ గా షెడ్యుల్ ని ఫినిష్ చేసారు రాఘవేంద్ర రావు. సారధీ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో సాంగ్ ను షూట్ చేసారు. అలాగే కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని సమాచారం.

రెండో షెడ్యుల్ ను నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో జరపనున్నారు. దాదాపు నెల రోజుల పాటు రెండో షెడ్యుల్ షూటింగ్ చేయనున్నారు. రోషన్ సరసన కన్నడ హీరోయిన్ శ్రీ లీలా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్.కే.ఫిలిమ్స్ , ఆర్కా మీడియా బ్యానర్స్ పై మాధవి కోవెలమూడి , శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.