రీమేక్ కు అంతా రెడీ

Thursday,October 13,2016 - 11:00 by Z_CLU

మంచి కథా బలం ఉండాలే కానీ సినిమా సక్సెస్ కి బడ్జెట్ తో సంబంధం ఉండదు. రీసేంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ‘పెళ్ళి చూపులు’ కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు. రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు బాలీవుడ్ లోనూ భారీగానే బారులుతీరారు. ఏమైతేనేం అంత కాంపిటీషన్ లోనూ, చివరికి వసు భగ్నాని హిందీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

1469628193_pelli-choopulu

నిర్మాత వశు భగ్నానీ తన కొడుకు జాకీ హీరోగా పెళ్లిచూపులు సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. ఇంత డిమాండ్ ని కూడగట్టుకున్న ‘పెళ్ళి చూపులు’ బాలీవుడ్ నిర్మాత నుండి ఎంత వసూలు చేసిందనేది అఫీషియల్ గా తెలియకపోయినా, దాదాపు 50-55 లక్షల వరకు చెల్లించుకున్నారని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా సమాచారం. ఇదే సినిమా రీమేక్ రైట్స్ ను దక్కించుకునేందుకు సల్మాన్ ఖాన్ ప్రయత్నించాడంటూ వార్తలు వచ్చినప్పటికీ.. ఫైనల్ గా వసు భగ్నానీకి రైట్స్ దక్కాయి.