పాయల్ తో ఫొటో దిగిన పాయల్

Wednesday,January 06,2021 - 04:46 by Z_CLU

ప్రతి హీరోయిన్ కు కొన్ని మరిచిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. పాయల్ (Payal Rajput) కు కూడా అలాంటి ఓ జ్ఞాపకం ఉంది. తన మనసుకు హత్తుకున్న ఆ జ్ఞాపకాన్ని షేర్ చేసుకుంది ఈ బ్యూటీ.

ఓ అభిమాని, పాయల్ ఆయిల్ పెయింటింగ్ గీశాడు. దాన్ని ఆమెకు బహుమతిగా పంపించాడు. తన పెయింటింగ్ చూసి పాయల్ పులకించిపోయింది.

అచ్చుగుద్దినట్టు, ఏమాత్రం తేడా లేకుండా అద్భుతంగా ఉన్న ఆ పెయిటింగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, తన పెయింటింగ్ తో తానే ఫొటో దిగింది పాయల్.

Payal-with-her-painting Payal-with-her-painting Payal-with-her-painting