Payal Police - విడుదలకు సిద్ధమైన 5Ws

Tuesday,December 22,2020 - 09:02 by Z_CLU

విలక్షణమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ కెరీర్ ను డిజైన్ చేసుకుంటున్న పాయల్ రాజ్ పుత్, ఇప్పుడు మరో పవర్ ఫుల్ పాత్రలోకి షిఫ్ట్ అయింది. ఆమె పోలీసాఫీసర్ గా కనిపించబోతోంది. సినిమా పేరు 5Ws.

payal-rajput-police-5ws-movie-zeecinemalu 3

5Ws అంటే – who, what, when, where, why’ (5 డబ్ల్యూస్ – ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు… అనేది ఉపశీర్షిక. గుణశేఖర్ దగ్గర డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన ప్రణదీప్ ఠాకూర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

కైవల్య క్రియేషన్స్ పతాకంపై యశోద ఠాకోర్ నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

payal-rajput-police-5ws-movie-zeecinemalu 3

ఇదొక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథ. పాయల్ ఇందులో సీరియస్ కాప్ గా కనిపించనుంది.

Also Check – పాయల్ గ్లామరస్ ఫొటోస్