యుద్ధ విమానం నడపబోతున్న పాయల్

Wednesday,February 05,2020 - 10:02 by Z_CLU

డిస్కోరాజా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఓ విషయాన్ని కావాలనే దాచింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. అప్ కమింగ్ మూవీస్ గురించి అడిగినప్పుడు ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాననిఆ డీటెయిల్స్ మాత్రం బయటపెట్టలేనని స్పష్టంచేసింది. ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు తెలిసిపోయింది. తన కొత్త సినిమాలో యుద్ధవిమానం పైలెట్ గా కనిపించబోతోంది పాయల్.

ప్రస్తుతం నరేంద్ర అనే సినిమా చేస్తున్న దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. ఒక అమాయకుడైన భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలులో ఎలా బందీ అయ్యాడు అక్కడి నుండి ఎలా తప్పించుకుని బయట పడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ. అతడ్ని పాక్ నుంచి బయటకు తీసుకొచ్చే యుద్ధ పైలెట్ గా పాయల్ కనిపించబోతోంది. తన జీవితంలో ఈ పాత్రను మరిచిపోలేనంటోంది పాయల్ పాప. త్వరలోనే యుద్ధ విమాన పైలెట్ గెటప్ లో పాయల్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.

ఉన్నంతలో పాయల్ కు మంచి పాత్రలే పడుతున్నాయి. ‘ఆర్ఎక్స్100′,  ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాల్లో ఆమె మంచి క్యారెక్టర్స్ పోషించింది. ఇప్పుడు యుద్ధ విమాన పైలెట్ గా కనిపించబోతోంది. మధ్యలో ఆర్డీఎక్స్ లవ్ లాంటి సినిమాల్ని ఆమె ఎవాయిడ్ చేస్తే మంచిది.