జీ స్పెషల్.. సీనియర్లకు సై

Saturday,March 21,2020 - 12:52 by Z_CLU

ఆర్ఎక్స్100తో చిన్నపాటి సునామీనే సృష్టించింది పాయల్ రాజ్ పుత్. బోల్డ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ ఇమేజ్ తో ఆమె కెరీర్ ఊపందుకోలేదు. పైగా సీతలో ఐటెంసాంగ్ సాంగ్ చేసి, తన కెరీర్ కు తానే బ్రేకులేసుకుంది పాయల్.

రీసెంట్ గా వెంకీమామలో వెంకటేష్ సరసన నటించి ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత మరో సీనియర్ హీరో రవితేజ సరసన డిస్కోరాజా చేసింది. అప్పటివరకు గ్లామరస్ బ్యూటీగానే పాయల్ ను చూసిన ప్రేక్షకులు.. డిస్కోరాజాతో పాయల్ లోని నటిని చూశారు. మూగమ్మాయిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినా అది పాయల్ కు కలిసిరాలేదు. ఎందుకంటే సినిమా ఫ్లాప్.

ఇప్పుడీ బ్యూటీ మరో సీనియర్ సరసన నటించడానికి రెడీ అవుతోంది. ఆ హీరో మరెవరో కాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాలో ఇప్పటికే అంజలి ఓ హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు మరో హీరోయిన్ గా పాయల్ ను తీసుకున్నారట.

వరుసగా సీనియర్ హీరోల సరసన నటిస్తూ వస్తున్న పాయల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.