అరుంధ‌తి-2 లో ఆర్ఎక్స్-100 బ్యూటీ

Sunday,June 23,2019 - 03:24 by Z_CLU

శ్రీ శంఖుచ‌క్ర ఫిలింస్ ప‌తాకంపై  పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో  కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం `అరుంధ‌తి-2`.  చారిత్రాత్మ‌క నేప‌థ్యంతో కూడిన క‌థాంశంతో  భారీ బ‌డ్జెట్ తో , భారీ  గ్రాఫిక‌ల్ చిత్రంగా ఇది రూపొందుతోంది.

చారిత్రాత్మ‌క, యూనివ‌ర్శల్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్ పుత్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన  ప్ర‌ముఖ తార‌లు న‌టిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేష‌న్ గ్రాఫిక‌ల్ వ‌ర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి.

క‌థాంశంలో భాగంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్… గుర్ర‌పుస్వారీ, క‌త్తి సాముల‌కు సంబంధించిన శిక్ష‌ణ హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ వ‌ద్ద‌ తీసుకుంటోంది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వరలోనే వెల్లడిస్తారు.