వరుణ్ తేజ్ సినిమాకి పవన్ టైటిల్ ఫిక్స్

Wednesday,September 06,2017 - 04:50 by Z_CLU

‘ఫిదా’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తొలి ప్రేమ టైటిల్ ను మళ్లీ ఇన్నేళ్లకు ఫ్రెష్ గా మరో సారి తెరపైకి తీసుకొస్తున్నాడు వరుణ్ తేజ్. వెంకీ డైరక్షన్ లో లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ కరెక్ట్ గా ఫిట్ అవుతుందని భావిస్తున్న యూనిట్ ఈ టైటిల్ నే సినిమాకు ఫైనల్ చేసారని సమాచారం.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు నిర్మాణంలో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.