'వకీల్ సాబ్' వచ్చేది అప్పుడే?

Tuesday,April 14,2020 - 04:55 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’. ఈ మూవీ కరోనా కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. మొన్నటివరకూ ఈ సినిమాను మే నెలలో (కుదిరితే 15వ తేదీ) విడుదల చేయాలనుకున్న మేకర్స్ ఇప్పుడు ఆగస్ట్ లో సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మిగిలిన షూట్ ను జూన్ లేదా జులై లో పూర్తిచేసే ప్లానింగ్ జరుగుతుంది.. ఒక షెడ్యూల్ మినహా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొన్నటివరకూ జరిగింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆ వర్క్ కూడా ఆగింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇతర పాత్రల్లో నివేత థామస్, అంజలి నటిస్తున్నారు.