పవన్ సినిమాకు ఆ టైటిలే ఎందుకు ?

Sunday,September 04,2016 - 02:30 by Z_CLU

 

పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్  కొత్త సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ… కాటమరాయుడు అనే టైటిల్ ను ప్రకటించాడు నిర్మాత శరత్ మరార్. అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు అనే సినిమా సాంగ్ ను పవన్ స్వయంగా పాడాడు. ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది. పైగా చరిత్రలో కాటమరాయుడు అనే పేరుకు ఓ ప్రాముఖ్యత కూడా ఉంది. పైగా రాయలసీమకు చెందిన వ్యక్తి పేరు అది. అందుకే పవన్ తన కొత్త సనిమాకు కాటమరాయుడు అనే టైటిల్ నే ఫిక్స్ చేశాడు. నిజానికి ఈ సినిమాకు మొదట కడప కింగ్ అనే టైటిల్ అనుకున్నారు. నిర్మాత శరత్ మరార్ అయితే తన బ్యానర్ పై ఆ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించాడు. కానీ ఫైనల్ గా కాటమరాయుడు అనే టైటిల్ ను పవన్ ఫిక్స్ చేశాడు. డాలీ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.