Pawan Bheemla Nayak - సమ్మర్ కి షిఫ్ట్?

Monday,October 11,2021 - 02:03 by Z_CLU

Pawan’s Bheemla Nayak may shifts to Summer from Sankranti

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్‘ సినిమా సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే సంక్రాంతికి RRR పోటీలో నిలవడం, రాజమౌళి భీమ్లా నాయక్ మేకర్స్ ని రిక్వెస్ట్ చేయడం వలన సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడా ? అని వెయిట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం మేరకు సినిమాను మార్చ్ లో సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మార్చ్ లో ఒక డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసుకొని త్వరలోనే ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. రెండో పాటను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తమన్ కంపోజ్ చేసిన ‘ANTHA ISHTAM’ అనే రొమాంటిక్ సాంగ్ ను ఈనెల 15న రిలీజ్ చేయబోతున్నారు.

pawan kalyan Bheemla Nayak movie stills

పేరుకి రీమేక్ అయినప్పటికీ ఇందులో చాలా మార్పులు చేశారు. త్రివిక్రమ్ ఇన్ పుట్స్ తో కథలో చాలా మార్పులు జరిగాయని సమాచారం. సాగర్ కె చంద్ర కూడా మన తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా బెస్ట్ వెర్షన్ రాసుకున్నాడని అంటున్నారు. అందుకే అతని చేతిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పెట్టి ఛాన్స్ ఇచ్చారని టాక్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రానాకి హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఒకమ్మాయిని సెలెక్ట్ చేసి ఆమెపై కొన్ని సన్నివేశాలు తీస్తారు. మరి సమ్మర్ లో ‘భీమ్లా నాయక్’ ఏ రేంజ్ కలెక్షన్స్ వసూళ్ళు చేస్తాడో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics