Bheemla Nayak - పవన్ సినిమా వచ్చేది అప్పుడే?

Wednesday,February 02,2022 - 06:15 by Z_CLU

Pawan’s Bheemla Nayak may release on April 1st Only

బడా సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. భీమ్లా నాయక్ మినహా అన్ని సినిమాలకు సంబంధించి ఒకే డేట్ ఎనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడొస్తుందో ? అనే చర్చ నడుస్తుంది. ‘RRR’ ,’ఆచార్య’ రిలీజ్ డేట్స్ వచ్చినవెంటనే ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న భీమ్లా నాయక్ విడుదల అంటూ చెప్పారు మేకర్స్. ఇందులో ఒక డేట్ అంటే ఫిబ్రవరి 25 సినిమా రావడం కష్టమే అనే మాటలు వినబడుతున్నాయి.

మేకర్స్ చెప్పిన మొదటి డేట్ కి ఇంకా జస్ట్ ఇరవై రోజులే ఉంది. ఈ లోపు ప్రమోషన్స్ చేసి సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావడం అంటే అవ్వని పని. పైగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా మేకర్స్ ఏప్రిల్ 1 కూడా ప్రకటించారు. ప్రోబబ్లీ సినిమాను రెండో డేట్ కి రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ కి ఇంకా రెండు నెలలు ఉంది. ఈ లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూల్ గా అయిపోతుంది. ప్రమోషన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టొచ్చు. ఎలాగో పవన్ కళ్యాణ్ , రానాలతో ఈవెంట్ ప్లాన్ చేయాలి. దానికి కూడా టైం కావాలి.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమాకు సంబంధించి రెండు డేట్స్ ప్రకటించారు. ఇక ఏప్రిల్ 29న మెగా స్టార్ ‘ఆచార్య’ థియేటర్స్ లోకి ఎంత్రే ఇవ్వనుంది. అదే నెల అంటే ఏప్రిల్ 1న అన్నయ్య కంటే ముందే మెగా ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నాడు పవర్ స్టార్. భీమ్లా నాయక్ ఏప్రిల్ లో వస్తే కనుక రెండు మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దద్దరిల్లడం, భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం.