పుట్టిన రోజు సందర్భంగా పవన్25 ఫస్ట్ లుక్

Thursday,August 24,2017 - 02:59 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మచ్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2రిలీజ్ చేయబోతునట్లు అఫీషియల్ గా ప్రకటించారు. పవన్ క్లాసీ లుక్ తో ఈ పోస్టర్ రాబోతుందని ఫాన్స్ కి ముందుగానే హింట్ ఇచ్చారు మేకర్స్.

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ గా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..