పవన్ కల్యాణ్, నితిన్, త్రివిక్రమ్ కాంబినేషన్...

Wednesday,November 16,2016 - 12:22 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో నితిన్, స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ చేతులు కలిపారు. వీళ్లు ముగ్గురూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ కాదు. నితిన్ హీరోగా నటించబోయే సినిమాకు పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఈరోజు ప్రారంభమైంది.

1

బుధవారం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెబుతానని నితిన్ ముందే ప్రకటించాడు. చెప్పినట్టుగానే ప్రేక్షకులకు ఇది బిగ్ బ్రేకింగ్ గా మారింది. నిజానికి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా నిర్మించాలని పవన్ భావించారు. కానీ అంతకంటే ముందే నితిన్ హీరోగా సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో రౌడీఫెలో సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్టుకు డైరక్ట్ చేయబోతున్నాడు.