పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Friday,September 08,2017 - 10:03 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో యూరప్ లో భారీ షెడ్యూల్ జరుపుకోనున్న సంగతి తెలిసిందే.. అయితే దాదాపు నెలపైనే జరగనున్న ఈ షెడ్యూల్ కంటే ముందు యూనిట్ బ్యాంకాక్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారట.

ప్రస్తుతం ఈ షెడ్యూల్ కి సంబంధించి యూనిట్ రెడీ అయ్యారని,  పవన్ కూడా ఇప్పటికె ఈ షెడ్యుల్ కోసం థాయిలాండ్ లో ల్యాండ్ అయ్యాడని సమాచారం. బ్యాంకాక్ లో కొన్ని మేజర్ సీన్స్ ను షూట్ చేసి తిరిగి వచ్చాక యూరప్ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారట యూనిట్. యూరప్ షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10 సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

హాసిని హారిక క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.