'పవన్-త్రివిక్రమ్' సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్...?

Sunday,August 06,2017 - 01:30 by Z_CLU

ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే..  పవన్ కూడా ఈ సంక్రాంతి కి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాతో థియేటర్స్ లోకి వస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.. ప్రెజెంట్ షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కే రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారని, ఇప్పటికే జనవరి 10న రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారనే టాక్ వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సాఫ్ట్ వేర్ గా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగస్టు 15 ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.