పవన్-త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభం...

Saturday,November 05,2016 - 12:40 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభమైంది. త్రివిక్రమ్ చెప్పిన కథకు ఇప్పటికే ఓకే చెప్పిన పవర్ స్టార్.. ఈరోజు అఫీషియల్ గా తమ హ్యాట్రిక్ మూవీకి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడు. గతంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలొొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది.

sai_0434

    ప్రస్తుతం డాలి దర్శకత్వం లో  ‘కాటమరాయుడు’ సినిమాను సెట్స్ పై పెట్టాడు పవన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది సెట్స్ పై ఉంటుండగానే ఈమధ్య తమిళ దర్శకుడు నేసన్ తో ఓ సినిమా ప్రారంభించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో కూడా సినిమాను ప్రారంభించాడు. నేసన్, త్రివిక్రమ్ సినిమాల్లో ఏది మొదట ప్రారంభం అవుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.