ఇంకాస్త ఆలస్యంగా పవన్-త్రివిక్రమ్ మూవీ...

Thursday,January 19,2017 - 11:31 by Z_CLU

ఓ వైపు గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నప్పటికీ.. మరోవైపు పొలిటికల్ గా కూడా బిజీ అవుతున్నాడు పవన్ కల్యాణ్. దీంతో త్రివిక్రమ్ తో పవర్ స్టార్ చేయాల్సిన సినిమా కొంచెం ఆలస్యం అవుతోంది. లెక్క ప్రకారం.. ఈ నెలాఖరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు.. మరో రెండు బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రివిక్రమ్ మూవీని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాడు పవన్.

తాజా సమాచారం ప్రకారం… పవన్-త్రివిక్రమ్ సినిమా వచ్చేనెలలో సెట్స్ పైకి వస్తుంది. చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఏకథాటిగా షూటింగ్ కంప్లీట్ చేసి, ఆగస్ట్ 11కు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మూవీకి సంబంధించి త్రివిక్రమ్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.

Pawan Kalyan in Attarintiki Daredi New Images

పవన్ సినిమాకు సంబంధించి హీరోయిన్లను కూడా ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్. ఫస్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను, సెకెండ్ హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను సెలక్ట్ చేశాడు. మరోవైపు మ్యూజిక్ డైరక్టర్ అనిరుథ్, ఈ సినిమాకు మ్యూజిక్ అందించే పనిలో బిజీగా ఉన్నాడు.